KTR speech at T innovation Summit 2023 : నాస్కామ్ లెక్కల ప్రకారం గత ఏడాదిలో దేశంలో ఉపాధి కల్పనలో 30 శాతం ఉద్యోగాలు తెలంగాణ నుంచే ఉన్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గత పదేళ్లలో హైదరాబాద్‌ను దేశంలోనే లీడింగ్ ఇన్నోవేషన్ నెట్వర్క్‌గా తీర్చిదిద్దినందుకు ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. టీ హబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన టీ ఇన్నోవేషన్-2023 సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
T Innovation Summit 2023 : ఈ సందర్భంగా మాట్లాడిన ఐటీ మంత్రి కేటీఆర్... గత పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిలో ఆవిష్కరణలకు ముఖ్యపాత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. ఆలోచన లేనిదే ఆవిష్కరణ లేదని అభిప్రాయపడిన మంత్రి... ఇంవేటర్స్, స్టేక్ హోల్డర్స్, వ్యవస్థాపకులు, ఎకాడమీష్యన్స్ అంతా కలిసి నేటి హైదరాబాద్ స్టార్టప్ ప్రపంచాన్ని నిర్మించడంలో చేతులు కలిపారని కొనియాడారు. మ్యాక్, సైన్స్ అండ్ ఆర్ట్స్ ఇలా అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. కేవలం ఐటీ ఉత్పత్తుల్లో మాత్రమే కాకుండా అగ్రికల్చర్ ఉత్పత్తుల్లో కూడా తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులతో పాటు మంత్రి మల్లారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.