Minister KTR Tweet Today: ఇప్పుడున్న రాజకీయ నేతలంతా ట్విటర్లో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే పోస్ట్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర మంత్రి కేటీఆర్ అయితే ట్విటర్లో యమా యాక్టివ్. ప్రజాసమస్యలతో పాటు రాష్ట్రాభివృద్ధి, కేంద్రంపై విమర్శలు, ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు ట్విటర్‌ను వేదిక చేసుకుంటారు కేటీఆర్. ఇక ఏదైనా విషయాన్ని ప్రజలతో పంచుకోవాలనుకున్నా కేటీఆర్ ఈ సామాజిక మాధ్యమానికే ప్రాధాన్యతనిస్తారు.
KTR Tweet Today: అలా మంత్రి కేటీఆర్.. ఇవాళ అమెరికాతో హైదరాబాద్ మహానగరానికి ఉన్న అనుబంధాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి నిలయమైన హైదరాబాద్.. వైవిధ్యం, కలుపుకుపోయే స్ఫూర్తిని సూచిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో చదువు, పనిచేస్తున్న తెలుగు కుటుంబాలని మంత్రి ఉదహరించారు. అమెరికా సెనేటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని గురువారం రోజున హైదరాబాద్‌లో కలిసింది. ఈ సందర్భంలోనే అమెరికా-హైదరాబాద్ అనుబంధాన్ని కేటీఆర్ మరోసారి గుర్తు చేసుకున్నారు.
ఈ సమావేశంలో జెన్నిఫర్ లార్సన్, ఎంపీ దామోదర్ రావు దివకొండ, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ వర్తమానం, భవిష్యత్ గురించి విస్తృతమైన యూఎస్- భారతీయ సంబంధాలతో ఎలా ముడిపడి ఉన్నాయనే అంశాలని మంత్రి కేటీఆర్ వారికి వివరించారు.