తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్రరాజ్యం సైతం తెలంగాణపైనే ఆధార పడుతోంది: మంత్రి కేటీఆర్

యూఎస్​ ఐబీసీ ఇన్వెస్ట్​మెంట్​ వెబినార్​లో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అమెరికన్​ కంపెనీల అధినేతలకు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. గత ఆరేళ్లుగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు భిన్నంగా పెట్టుబడులను ఆకర్షిస్తోందని అన్నారు.

By

Published : Jul 9, 2020, 7:34 PM IST

KTR review in US IBC investment webinar
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడాలి: కేటీఆర్​

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడాలి: కేటీఆర్​

యూఎస్​ ఐబీసీ ఇన్వెస్ట్​మెంట్​ వెబినార్​లో అమెరికన్​ కంపెనీల అధినేతలతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్ వారికి​ వివరించారు. ఆరేళ్లుగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు భిన్నంగా పెట్టుబడులను ఆకర్షిస్తోందని తెలిపారు.

భారతదేశాన్ని ఒక యూనిట్​లా కాకుండా తెలంగాణ లాంటి రాష్ట్రాలను ప్రత్యేకంగా చూడాలని చెప్పారు. ప్రస్తుతం కరోనా సంక్షోభానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలబడుతుందని వివరించారు. రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగానికి సంబంధించి బలమైన వ్యవస్థ ఉందని పేర్కొన్నారు.

అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందులపై ఆధార పడుతుందని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడుల వాతావరణాన్ని అమెరికన్​ కంపెనీలు ప్రశంసించాయని అన్నారు. నూతన పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశమని సూచించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీనిచ్చారు. టీఎస్ ఐపాస్ అద్భుతమైన విధానమని కంపెనీలు కొనియాడాయి.

ఇదీ చదవండి :ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ABOUT THE AUTHOR

...view details