తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR on Dharani : 'భూమి చుట్టూ ఉన్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పే బ్రహ్మాస్త్రం.. ధరణి'

KTR on Ward Administration System : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల్ని కలవడం లేదనే విమర్శలకు... పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బదులిచ్చారు. ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడే... సమస్య తన వరకు వస్తుందని కేసీఆర్ అన్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారని... పాలనను ప్రజల వద్ద చేర్చారని తెలిపారు. మరోవైపు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

KTR
KTR

By

Published : Jun 10, 2023, 3:42 PM IST

KTR Comments on Ward Administration System : దేశంలోనే తెలంగాణ ఈ-గవర్నెన్స్‌లో ప్రథమ స్థానంలో ఉందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల్ని కలవడం లేదనే విమర్శలకు... మంత్రి కేటీఆర్‌ బదులిచ్చారు. ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడే... సమస్య తన వరకు వస్తుందని కేసీఆర్ అన్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారని... పాలనను ప్రజల వద్ద చేర్చారని తెలిపారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జీహెచ్​ఎంసీ వార్డు అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

Good Governance Day in Telangana:హైదరాబాద్‌లోని ఒక్కో డివిజన్‌లో 70 నుంచి లక్ష వరకు జనాభా ఉంటుందని... క్షేత్రస్థాయిలో వారికి సేవలు అందించేందుకే వార్డు అధికారుల వ్యవస్థ తీసుకొచ్చామనికేటీఆర్ స్పష్టంచేశారు. సెప్టెంబర్‌ నాటికి ఎస్​టీపీల ద్వారా జీహెచ్​ఎంసీలోని ప్రతి నాలాలోని మురుగునీటిని శుద్ధి చేస్తామని వివరించారు. ఈ నెల 16న పట్టణ ప్రగతి దినోత్సవం రోజున 150 ప్రాంతాల్లో ఒకేసారి వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామన్నారు. వార్డు అధికారుల జాబ్‌ చార్ట్‌తో పాటు పౌరుల ఫిర్యాదులను ఎంతకాలంలో పరిష్కరిస్తామో చెప్పే సిటిజన్ చార్టర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. ఇలాంటి వార్డు కార్యాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని ఇదే ప్రథమమని కేటీఆర్ చెప్పారు. ప్రజలకు కూడా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కేటీఆర్ కోరారు.

'కేసీఆర్‌ ప్రజా దర్బార్‌ ఎందుకు నిర్వహించడంలేదని కొందరు అంటున్నారు. ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడే సీఎం దగ్గరకు సమస్య. యంత్రాంగం సరిగ్గా పనిచేసే సీఎం వద్దకు సమస్యలతో రావాల్సిన అవసరం లేదు. అందుకే రాష్ట్రంలో కేసీఆర్‌ పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారు. జీహెచ్‌ఎంసీలో ప్రజలకు సేవలందించేదుకు వార్డు అధికారుల్ని ప్రవేశపెట్టాం. 8 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను లిఫ్ట్‌ చేస్తున్నాం. జవహర్‌నగర్‌లో తడి చెత్త ద్వారా రూ.200 కోట్లు సంపాదిస్తున్నాం. పొడి చెత్త ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం. 2024 డిసెంబర్‌ కల్లా 101 మెగావాట్ల విద్యుత్‌ను చెత్త ద్వారా ఉత్పత్తి చేస్తాం.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లు: కేటీఆర్

Talasani Latest comments : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే సుపరిపాలన వల్ల హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గతంలో కంటే ఐటీ పరిశ్రమ, ఇతర రంగాలలో జరిగిన అభివృద్ది వలన నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం... ధరణి పార్టల్‌ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని...రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. శరవేగంగా.. పరుగులు పెడుతున్న మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే.. పునాదిరాళ్ళు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. టీఎస్-ఐపాస్‌ విధానంతో పెట్టుబడులకు రాష్ర్టం స్వర్గధామమైంది అంటూ ప్రశంసించారు.

భూమి చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్ళను విప్పేందుకు ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం... ధరణి పార్టల్‌ అంటూ కొనియాడారు. జిల్లాల పునఃవ్యవస్థీకరణ నుంచి నూతన కలెక్టరేట్ల నిర్మాణం వరకూ... తండాలు గ్రామపంచాయతీల నుంచి నూతన రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల వరకూ రాష్ర్టంలో సాగిన ప్రతి సంస్కరణ పథం భవిష్యత్ తరాలకు వెలకట్టలేని ఆభరణం అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details