KTR Letter to Hardeep Singh Puri: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. మెట్రో రెండో విడత కింద నిర్మించబోయే బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని కేటీఆర్ లేఖలో తెలిపారు. మెట్రో రెండో విడత ప్రాజెక్టు నిర్మాణానికి రూ.8,453 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర నిధులు అందించాలని కేటీఆర్ కేంద్రమంత్రికి విన్నవించారు. దీనికోసం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని లేఖలో మంత్రి కేటీఆర్ కోరారు.
మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం అందించండి: కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ - కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీకి కేటీఆర్ లేఖ
KTR Letter to Hardeep Singh Puri: కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం కోరుతున్నట్లు లేఖలో తెలిపారు. బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని హర్‌దీప్‌సింగ్ పూరీకి విన్నవించారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను 69 కిలోమీటర్లకు పైగా విస్తరించి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రెండో దశలో మొత్తం 31 కిలోమీటర్ల పొడవును రెండు భాగాలతో రూపొందించామన్నారు. రెండో విడత కారిడార్ బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కి.మీ పొడవునా మెట్రో మార్గం ఉండనుందని తెలిపారు. ఇందులో 23 స్టేషన్లు రాబోతున్నాయన్నారు. కారిడార్ 3 లోని నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కి.మీ పొడవునా 4 స్టేషన్లు వచ్చేలా నిర్మాణం ఉండనుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: