తెలంగాణ

telangana

ETV Bharat / state

తక్కువ ఖర్చుతో కరోనా చికిత్సకు వెంటిలేటర్ - Ktr_Inspection_T_Works_Ventilator

కరోనా బాధితులకు అవసరమైన వెంటిలేటర్​ను రూ. 35 వేల ఖర్చుతో టీవర్క్స్​ అందుబాటులోకి తెచ్చింది. వివిధ సంస్థల భాగస్వామ్యంతో రూపొందించిన దీన్ని హైదరాబాద్​ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు.

Ktr_Inspection_T_Works_Ventilator at ghmc office
తక్కువ ఖర్చుతో కరోనా చికిత్సకు వెంటిలేటర్

By

Published : Apr 20, 2020, 5:12 PM IST

కరోనా బాధితుల చికిత్సకు అవసరమైన వెంటిలేటర్‌ను టీవర్క్స్ తక్కువ ఖర్చులో అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ ఇంజినీరింగ్‌ సంస్థల భాగస్వామ్యంతో రూపొందించిన ఈ వెంటిలేటర్ హైదరాబాద్‌ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో టీ వర్క్స్‌కు చెందిన 20 మంది యువ నిపుణులు...30 రోజుల్లో ఈ వెంటిలేటర్‌ను తయారు చేశారు.

ఇందుకోసం అనేక వివిధ ప్రోటోటైప్ పరికరాలను ఉపయోగించి, పలుమార్లు వాటిని పరిశీలించిన తరువాత ప్రస్తుత నమూనాను తయారు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఈ వెంటిలేటర్​తో రోగికి అవసరమైన సేవలు అందించేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఇందులో ఉన్నాయన్నారు. రూ.35 వేల ఖర్చుతో తయారుచేసిన దీని నిర్మాణంలో నిమ్స్ వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో మరింత చౌకగా అత్యుత్తమ సౌకర్యాలతో అందించనున్నట్లు టీవర్క్స్ ప్రకటించింది.

ఇవీచూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details