పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడిలో ఆంధ్రప్రదేశ్లో పదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది 24 వేల ఉద్యోగాలు మాత్రమేనని వెల్లడించారు. సురభి వాణిదేవీకి ఉన్న అర్హతలు ఇతర అభ్యర్థులకు లేవన్న కేటీఆర్.. ఆమె విజయానికి పాటుపడాలని తెరాస నేతలకు మార్గనిర్దేశం చేశారు.