తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు : కేటీఆర్

KTR Fires on Congress Government : తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాకుండా, దిల్లీ నామినేట్‌ చేసిన వ్యక్తి సీఎం అయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వచ్చిన ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడుతుంది కానీ, ఆస్తుల గురించి మాట్లాడటం లేదని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.

KTR Assembly Speech Today
KTR Fires on Congress Govenment

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 2:26 PM IST

KTR Fires on Congress Government : రాష్ట్ర ప్రజల కోసం అప్పులు చేశామని, సంపద సృష్టించామని కేటీఆర్(KTR) అసెంబ్లీలో పేర్కొన్నారు. రాష్ట్రం దివాళా తీయలేదని, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగంలో సత్యదూరమైన మాటలు కనిపించాయని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉంటామని స్పష్టం చేశారు.

గవర్నర్‌ ప్రసంగం తప్పుల తడకగా ఉంది - మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు : కేటీఆర్

KTR Assembly Speech Today :గత కాంగ్రెస్‌ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు తప్ప మరేమి లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ పాలన తెస్తామని కాంగ్రెస నేతలు మాట్లాడుతున్నారని ఇందిరమ్మ రాజ్యంలో గంజి కేంద్రాల దుస్థితి వచ్చిందన్నారు. గత కాంగ్రెస్‌(Congress) పాలనలో కరెంట్‌ లేదు, మంచినీటి సమస్యలు ఉండేవని, నల్గొండలో ఫ్లోరైడ్‌ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాతబస్తీలో మైనార్టీ తీరని బాలికల వివాహాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ సభ్యులు మిడిసిపడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

24 గంటల కరెంట్‌ కోసం అప్పులు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్క ఏడాది కూడా క్రాప్‌ హాలీడే ఇవ్వని ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. మా పాలనలో అప్పులు గురించే చెప్తున్నారు.మేము సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదు. గవర్నర్‌ ప్రసంగంలో పౌరసరఫరాల శాఖ గురించి అబద్ధాలు చెప్పారు. నిరుద్యోగుల ఆంశంలో ఆత్మహత్యలు తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR Speech on Telangana Debts : విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యుత్‌ ప్లాంట్లు కట్టడం తప్పా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ట్రాన్స్‌కో ఆస్తులు రూ.24,470 కోట్లు, జెన్‌కో రూ.53,963 కోట్లు సృష్టించాం. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పూర్తి చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. రూ.1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించాం. అప్పులు చూపించి గృహజ్యోతి పథకం నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు.

తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాకుండా దిల్లీ నామినేట్‌ చేసిన వ్యక్తి సీఎం అయ్యారని కేటీఆర్ దుయ్యబట్టారు. పదేళ్లలో మహబూబ్‌నగర్‌లో వలసలు ఆగిపోయాయి. ఎన్‌ఆర్‌ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరో చెప్పాలి?. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేయాలి. మేము స్వాగతిస్తాం.కోటిన్నర మంది మహిళల ఖాతాలో రూ.2,500 వేస్తారన్నారు. రూ.2,500 ఖాతాలో ఎప్పుడు వేస్తారో అని మహిళలు వేచి చూస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే స్వాగతిస్తామన్నారు. ఎన్‌కౌంటర్‌ పేరిట హత్యలు చేసింది ఎవరో చెప్పాలి. ఆనాడు చర్చల కోసం నక్సలైట్లను పిలిచి చంపింది ఎవరో చెప్పాలి. విద్యుత్‌ రంగం గురించి చాలా చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో పదేళ్ల పాలన గురించి శ్వేతపత్రం విడుదల చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు.

"రాష్ట్ర ప్రజల కోసం అప్పులు చేశాం. సంపద సృష్టించాం. ఒక్క ఏడాది కూడా క్రాప్‌ హాలీడే ఇవ్వని ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. మా పాలనలో అప్పుల గురించే చెప్తున్నారు. మేం సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదు. రాష్ట్రంలో ట్రాన్స్‌కో ఆస్తులు రూ.24,470 కోట్లు, జెన్‌కో రూ.53,963 కోట్లు సృష్టించాం". - కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

"రాష్ట్రం దివాళా తీయలేదు- దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు"

రేవంత్​ రెడ్డి వర్సెస్​ కేటీఆర్ - శాసనసభలో వాడీవే'ఢీ' చర్చ

ABOUT THE AUTHOR

...view details