తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దుప్పట్లతో పాటు మొక్కలను కూడా అంద చేశారు. బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఆసరాగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.
కేటీఆర్ పుట్టినరోజు.. పేదలకు దుప్పట్ల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. పలువురు నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
కేటీఆర్ పుట్టినరోజు..పేదలకు దుప్పట్ల పంపిణీ