తెలంగాణ ప్రభుత్వ పన్ను విధానలు నచ్చి అమెజాన్ హైదరాబాద్‌కు వచ్చింది. అమెజాన్ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉంది. అమెజాన్ హైదరాబాద్‌కు వచ్చేందుకు అధికారులు ఎంతో కృషి చేశారు. ఐటీ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. కేవలం ఆరేళ్లలోనే తెలంగాణ స్టార్టప్‌ల పాలిట స్వర్గధామంగా మారింది.
''తెలంగాణ ఎలక్ట్రిక్ హబ్‌గా మారుతోంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లోనూ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతాం. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్‌లోనే తయారైంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ తెలంగాణ ముందువరుసలో ఉంది. జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లోనూ హైదరాబాద్ సత్తా చాటింది. రాబోయే రెండు దశాబ్దాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మంచి భవిష్యత్తు ఉంది.''