ETV Bharat / state
తాగునీటి లెక్కలు ఇవ్వండి - ts
మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు సూచించింది.
నీటి నిర్వహణ
By
Published : Feb 14, 2019, 6:03 AM IST
| Updated : Feb 14, 2019, 8:11 AM IST
తాగునీటి అవసరాల కోసం రెండు నెలలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలివ్వాలని తెలుగు రాష్ట్రాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సూచించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల అధికారికి బోర్డ్ కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి వినియోగ మట్టం 834 అడుగులు. ఇంతకు దిగువన జలాల వినియోగం బోర్డు అనుమతి లేకుండా తీసుకోరాదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇందుకు విరుద్ధంగా నీటిని వినియోగిస్తున్నాయని బోర్డు తెలిపింది. 13వ తేదీ నాటికి శ్రీశైలంలో నీటిమట్టం 833.3 అడుగులకు పడిపోయి.. 52.9 టీఎంసీలు నిల్వ ఉందని పేర్కొంది. కల్వకుర్తి నుంచి తెలంగాణ రాష్ట్రం 2.6 టీఎంసీల నీరు తీసుకోవాల్సి ఉంది. హంద్రీనీవా, ముచ్చుమర్రి నుంచి కేటాయింపునకు మించి 6.69 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా వాడుతోందని బోర్డు తెలిపింది.నీళ్లు ఎన్నికావాలి
Last Updated : Feb 14, 2019, 8:11 AM IST