తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రానికి 140 ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీలు' - ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీలు

వచ్చే జూన్ వరకు తెలుగు రాష్ట్రాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 140 టీఎంసీలు కేటాయించిన బోర్డు... ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీలు కేటాయించింది. వరదసమయంలో వినియోగించుకున్న అధిక జలాలను ఎలా పరిగణించాలన్న విషయమై తేల్చేందుకు కమిటీని నియమించాలని నిర్ణయించారు. బోర్డు నిర్వహణా నియమావళికి సంబంధించి మరోమారు విడిగా బోర్డు సమావేశం కానుంది.

krishna board meeting at hyderabad
'రాష్ట్రానికి 140 ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీలు'

By

Published : Jan 10, 2020, 4:46 AM IST

తెలుగు రాష్ట్రాలకు నీటికేటాయింపులు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు ఛైర్మన్ ఆర్​కే గుప్తా అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇరు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్​లు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపులపైనే ప్రధానంగా చర్చించారు. వరద వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ అధికంగా ఉపయోగించుకున్న జలాల విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. అదనంగా వినియోగించుకున్న నీటిని ఏపీ కోటాలో వేయాలని తెలంగాణ కోరుతోంది. ఏపీ మాత్రం వరద జలాలను లెక్కించవద్దని వాదించింది. ఈ అంశాన్ని తేల్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే నీటి సంవత్సరంలోగా కమిటీ ఈ అంశాన్ని తేల్చనుంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై నిర్మించిన క్రాస్ వాల్స్ విషయాన్ని ప్రస్తావించిన ఏపీ... ఆ గోడలను తొలగించాలని కోరింది. క్రాస్ వాల్స్​ను ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించారని... ఇప్పుడు తొలగించడం సాధ్యం కాదని తెలంగాణ స్పష్టం చేసింది.

నిర్వహణ బోర్డు తరలింపుపై చర్చ...
బోర్డు నిర్వహణా నియమావళిపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. నిర్వహణా బోర్డు తరలింపు అంశం చర్చకు వచ్చింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డును తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఏపీ అధికారులు కోరారు. విభజనచట్టం ప్రకారం ఏదో ఒకరోజు బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందేనని ఛైర్మన్ గుప్తా అభిప్రాయపడ్డారు. పట్టిసీమ, పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్నందున తమకు అదనంగా 45 టీఎంసీలు కేటాయించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డు నిర్ణయించింది.

'రాష్ట్రానికి 140 ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీలు'

త్రిసభ్య కమిటీ సమావేశం...
గత సంవత్సరం మాదిరిగానే అందుబాటులో ఉన్న జలాలను పరిగణలోకి తీసుకుని ఇరు రాష్ట్రాలకు ఈ ఏడాది కేటాయింపులు జరిపినట్లు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం వెల్లడించారు. బోర్డు నిర్దేశించిన నియమావళి ప్రకారం ఏపీకి 66 తెలంగాణకు 34 శాతం జలాలు కేటాయించడం జరిగిందని తెలిపారు. బోర్డు సమావేశం అనంతరం త్రిసభ్య కమిటీ విడిగా సమావేశమై మే నెలాఖరు వరకు సాగు, తాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
ఈనెల 21న దిల్లీలో కేంద్రజలశక్తి శాఖ నిర్వహించే సమావేశంలో బోర్డుకు సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపైనా సమావేశంలో చర్చించారు.

ఇవీ చూడండి: 'పార్టీల కార్పొరేట్ డొనేషన్లపై నిషేధం విధించాలి'

ABOUT THE AUTHOR

...view details