తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణకు 29, ఏపీకి 17.5 టీఎంసీలు - BOARD

వేసవి కాలం దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్టా నీటి పంపకాలపై యాజమాన్య బోర్డు సమావేశమైంది. శ్రీశైలం, సాగర్​ నుంచి తాగు, సాగు అవసరాలకోసం నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

వేసవి కోసం పంపకాలు...

By

Published : Mar 14, 2019, 4:54 PM IST

Updated : Mar 14, 2019, 5:08 PM IST

వేసవి కోసం పంపకాలు...
హైదరాబాద్‌ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. మే వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరమైన నీటి కేటాయింపుపై భేటీలో చర్చించారు. తెలంగాణకు 29, ఏపీకి 17.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కమిటీ నిర్ణయించింది. శ్రీశైలంలో 800, సాగర్‌లో 505 అడుగుల నీటిమట్టం ఆధారంగా ఈ కేటాయింపులు చేశారు. సాగర్‌లో వీలైనంత మేరకు 510 అడుగుల వరకు నీటిమట్టం ఉండేలా చూడాలని బోర్డు నిశ్చయించింది. భేటీలో బోర్డు ఛైర్మన్ ఆర్.కె.జైన్‌, సభ్య కార్యదర్శి హరికేష్ మీనా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Last Updated : Mar 14, 2019, 5:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details