ఈనెల17న 119 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా 162 గురుకులాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో గురుకుల పాఠశాలలున్నాయన్నారు. వేలల్లో ఫీజులు కట్టలేని పేదల కోసం ఈ పాఠశాలలు ఏర్పాటుచేయాలని సీఎం ఆకాంక్షించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడేనాటికి 19 గురుకుల పాఠశాలలే ఉన్నాయని గుర్తు చేశారు. మొత్తం గురుకులాల్లో 37,155 మంది విద్యార్థులున్నారని, వారి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. గురుకులాల్లో ప్రవేశాల కోసం పోటీ పెరుగుతోందని వెల్లడించారు. గురుకులాల్లో సీట్ల పెంపు విషయమై సీఎం ఆలోచన చేస్తున్నట్లు స్ఫష్టం చేశారు.
'దేశానికే ఆదర్శంగా రెసిడెన్షియల్ విద్యావ్యవస్థ' - minister
రాష్ట్రంలో కొత్తంగా 119 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. గురుకులాలకు పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీట్ల పెంపుపై కూడా సీఎం ఆలోచిస్తున్నారు.
కొప్పుల ఈశ్వర్
ఇవీ చూడండి: పబ్లో మహిళపై సహోద్యోగుల దాడి