చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. గచ్చిబౌలి పోలీసులు ఎన్నికల సమయంలో కొండా సహాయకుడి వద్ద రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చేందుకు ఎంపీ కార్యాలయానికి వెళ్లిన తనను నిర్బంధించారని బంజారాహిల్స్ పీఎస్‌లో గచ్చిబౌలి ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. తనను అవమానించి విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై ఫిర్యాదులో పేర్కొన్నారు. వారం రోజుల క్రితమే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరారు.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ - konda vishweshwar reddy
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఎన్నికల సమయంలో ఎస్సైని నిర్బంధించారన్న కేసులో ముందుస్తు బెయిల్ కోరారు విశ్వేశ్వర్ రెడ్డి.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ