తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరవలేనిదని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఆర్.ఎం.రావు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
రాష్ట్ర సాధనలో బాపూజీ పాత్ర మరవలేనిది: ఎం.ఆర్.ఎం.రావు
నమ్మిన సిద్ధాంతం కోసం మంత్రి పదవినే త్యజించిన త్యాగశీలి బాపూజీ అని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు పేర్కొన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
రాష్ట్ర సాధనలో బాపూజీ పాత్ర మరవలేనిది: ఎం.ఆర్.ఎం.రావు
నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్నత పదవిని త్యజించిన త్యాగశీలి బాపూజీ అని కమిషనర్ కొనియాడారు. ఎందరికో స్ఫూర్తివంతమైన ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముందని తెలిపారు.
ఇదీచూడండి:కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన మంత్రి కొప్పుల