Komatireddy Venkatareddy replied to notices by AICC: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి భాజపా అభ్యర్థి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఒత్తిడి తీసుకువచ్చారనే అభియోగంపై ఏఐసీసీ షోకాజ్ నోటీసుకు భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. గత నెల 22న వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఈనెల 1వ తేదీ వరకు గడువు విధించింది. అయితే ఆ సమయానికే వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లారు. పదిరోజుల తరవాత విదేశం నుంచి తిరిగి వచ్చిన తరవాత తన సమాధానాన్ని సీల్డ్ కవర్లో పంపించినట్లు ఆయన వెల్లడించారు.
ఆడియో వైరల్: తరచూ కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసి భాజపా అభ్యర్థి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు వెంకట రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆధారాలేం లేకపోవడంతో ఏఐసీసీ నాయకత్వం వేచి చూసింది. 15రోజుల క్రితం కిందట మునుగోడుకు చెందిన జబ్బార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి తన తమ్ముడికి ఓటు వేయాలని సూచించారు. ఇదే ఆడియో బయటకు వచ్చి వైరల్ అయ్యింది. ఆ మరుసటి రోజు వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన మరోసారి మునుగోడులో కాంగ్రెస్‌ను బలహీన పరిచేలా చేసింది.