కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేషీలో ముగ్గురు తెలంగాణ అధికారులు పని చేయనున్నారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా ఉన్న ఆమ్రపాలిని ఓఎస్డీగా, శశికిరణాచారిని హైదరాబాద్‌లో అదనపు ప్రైవేటు కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పంపాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఐపీఎస్ అధికారి ఉత్తర మండల డీసీపీ అంబర్ కిశోర్ ఝాను ప్రైవేటు కార్యదర్శిగా నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లను పరిశీలించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ముగ్గురు పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.
కిషన్ రెడ్డి ఓఎస్డీగా ఆమ్రపాలి..!
రాష్ట్రంలో అధికారుల శాఖలను కేంద్రం మార్పు చేయనుంది. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేషీలో ముగ్గురు తెలంగాణ అధికారులు పని చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి.
కిషన్ రెడ్డి ఓఎస్డీగా ఆమ్రపాలి..!
Last Updated : Jul 13, 2019, 7:17 AM IST