Kishan Reddy Angry With KCR: కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అంటే.. కేసీఆర్ జోక్ ఇన్ ఇండియా అంటూ అపహేళన చేస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించినందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.
ప్రజలు బీజేపీ ద్వారా మార్పు వస్తుందని భావించడానికి.. ఈ ఎన్నికల ఫలితమే నిదర్శనమని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా టెక్స్‌టైల్స్ రంగంలో తెలంగాణకు మెగా టెక్స్‌టైల్స్ పార్కును కేంద్రం కేటాయించిందని కేంద్రమంత్రి తెలిపారు. వరంగల్లో టెక్స్‌టైల్ పార్కును పెట్టాలనే ఒక ఆలోచన ఉందని తెలిపారు.
Central Govt Means Make In India.. KCR Joke In India: టెక్స్‌టైల్స్ రంగాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రధానమంత్రి పీఎం మిత్ర పథకం ద్వారా తయారీ సంస్థలను నెలకొల్పుతున్నారని వివరించారు. ఇప్పటికే ఈ పీఎం మిత్ర పథకానికి రూ.4,445కోట్లు కేటాయించారన్నారు. ఒక్కో టెక్స్‌టైల్ పార్కుకు కనీసం 1000 ఎకరాల స్థలం అవసరమవుతుందని ఆనాడు చెప్పామన్నారు. ఈ విషయంపై తెలంగాణలో పార్కును ఏర్పాటు చేసేందుకు స్థలం విషయంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని కిషన్‌రెడ్డి తెలిపారు.