"భవిష్యత్తు ప్రపంచాన్ని నడిపించే స్వశక్తి, స్వావలంబనతో కూడిన భారతదేశ నిర్మాణానికి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మీ స్ఫూర్తిదాయక సందేశం, దూరదృష్టి గల నాయకత్వంలో భారత్ భద్రంగా ఉంది. కరోనా విపత్తుతోపాటు భవిష్యత్తులో ఎదురయ్యే సంక్షోభాలను ఎదుర్కునేందుకు మరింత విశ్వాసంతో ముందుకెళ్తుంది"
- కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
మోదీ ప్రకటించిన ప్యాకేజీపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ హర్షం
భారతదేశ నిర్మాణానికి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని దూరదృష్టి గల నాయకత్వంలో భారత్ భద్రంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ ఆత్మ నిర్భార్ అభియాన్ పథకం కింద ఉద్దీపన ప్యాకేజీ.. దేశ జీడీపీలో 10 శాతంగా ఉందని బండి సంజయ్ తెలిపారు.
"ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని స్వాగతిస్తున్నాం. భారత్ ఆత్మ నిర్భార్ అభియాన్ పథకం కింద ఉద్దీపన ప్యాకేజీ.. దేశ జీడీపీలో 10 శాతం. దేశం స్వావలంబన దిశగా ముందుకు వెళ్లడానికి దేశ ప్రజలకు ప్రధాని మోదీ స్పష్టమైన మార్గాన్ని సూచించారు. ప్రపంచమే తీవ్రమైన సంక్షోభంలో ఉన్న సమయంలో దేశానికి మోదీ ఒక నిర్ణయాత్మకమైన నాయకత్వాన్ని వహించడం అభినందనీయం."
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి:పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన