కిరీటాల నిందితులను పట్టుకుంటాం : తితిదే సీవీఎస్వో గోపీనాథ్ - svso
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం పై అర్ధరాత్రి వరకూ తితిదే సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి ఆలయంలో దర్యాప్తు చేపట్టారు. కచ్చితంగా నిందితులను పట్టుకుంటామన్నారు.
GOVINDA RAJA SWAMY
కిరీటాలపై దర్యాప్తు
శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో మూడు బంగారు కిరీటాలు మాయం అయ్యాయని గోపీనాథ్ జెట్టి వెల్లడించారు. ఆలయ సూపరిండెంట్ అనుమానంతో ఫిర్యాదు ఇచ్చారన్నారు. మూడు కిరీటాలు 1351 గ్రాములుంటాయని, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ పోలీసులు, తితిదే విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా విచారిస్తున్నారని తెలిపారు. ఆలయంలోని 12 సీసీ కెమెరాలు, హూండీలు పరిశీలిస్తామన్నారు.
Last Updated : Feb 3, 2019, 7:51 AM IST