అఖిల ప్రియను కలిసేందుకు బేగంపేటలోని లెర్నింగ్ సెంటర్కు వచ్చానని ఆమె సోదరి మౌనిక రెడ్డి చెప్పారు. తన సోదరి ఆరోగ్యం బాగోలేనందున మందులు, ఆహారం తీసుకొచ్చానని తెలిపారు. కానీ పోలీసులు తనను లోనికి అనుమతించలేదన్నారు. కేవలం ఆహారం, మందులు లోనికి తీసుకెళ్లారని పేర్కొన్నారు.
'మా అక్క అఖిలప్రియను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు'
అఖిలప్రియను ఎందుకు అరెస్ట్ చేశారో తనకు తెలియదని ఆమె సోదరి మౌనిక రెడ్డి తెలిపారు. సోదరిని కలిసేందుకు బేగంపేటకు వచ్చిన ఆమెకు అనుమతి లభించలేదు. ఆహారం, మందులను మాత్రమే లోపలికి పంపించారు.
'మా అక్క ఎక్కడుందో తెలియదు... తెలిస్తే నేనే చెబుతా'
బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను కూకట్పల్లిలోని ఆమె నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను బేగంపేటలోని లెర్నింగ్ సెంటర్కు తీసుకెళ్లారు. అఖిల ప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాసేపట్లో అఖిలప్రియను వైద్య పరీక్షలకు తరలిస్తామన్నారు.
ఇదీ చూడండి:పోలీసుల అదుపులో అఖిలప్రియ.. పరారీలో భర్త భార్గవరామ్