తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్క రోజులోనే ఆరు వేలకు పైగా కియా కార్ల బుకింగ్ - సికింద్రాబాద్

ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వాహన ప్రేమికుల ఆశ నేరవేరింది. ఎట్టకేలకు కియా మోటార్స్ తన తొలి సెల్టోస్ వాహనాన్ని  ఈరోజు హైదరాబాద్​లో ఆవిష్కరించింది.

ఒక్క రోజులోనే ఆరు వేలకు పైగా కార్లు బుకింగ్

By

Published : Aug 3, 2019, 11:34 PM IST

ఒక్క రోజులోనే ఆరు వేలకు పైగా కార్లు బుకింగ్

వాహన ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న కియా మోటార్స్ తన తొలి సెల్టోస్ వాహనాన్ని హైదరాబాద్​లో ఇవాళ ఆవిష్కరించింది. మూసాపేట్, నాగోల్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ ప్రాంతాలలో కియా స్టోర్లను జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన ప్రారంభించారు.

ఆకర్షణీయమైన డిజైన్, వైబ్రెంట్ కలర్స్, స్మార్ట్ ఫీచర్స్​తో కూడిన బీఎస్6 ప్రమాణాలు గల ఈ కారును సొంతం చేసుకునేందుకు నగరవాసులు పోటీపడ్డారు. ఒక్క రోజులోనే ఆరు వేలకు పైగా కార్లు బుకింగ్ చేసినట్లు కియా కంపెనీ సౌత్ ఇండియా విభాగం ప్రకటించింది. 1.4 టర్బో ఇంజిన్, మానిటర్​తో కూడిన 360 డిగ్రీ కెమెరా డిస్​ప్లే, హెచ్​డీ నావిగేషన్ వంటి ఎన్నో ఆధునాతన ఫీచర్స్ గల ఈ కారు ధర, డెలివరీ తేదీలను త్వరలో ప్రకటిస్తామని కియా మోటార్స్ ప్రకటించింది. మొదట 25 వేల రూపాయలతో కారు బుక్ చేసుకోవచ్చని డీలర్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details