తెలంగాణ

telangana

ETV Bharat / state

'కిలో ప్లాస్టిక్ - కిలో బియ్యం' స్టోరీ చెప్పిన నామ

ప్లాస్టిక్​పై తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుందన్నారు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు. లోక్​సభలో పర్యావరణ పరిరక్షణపై జరిగిన చర్చలో ఆయన కిలో ప్లాస్టిక్ - కిలో బియ్యం పథకంతో ప్లాస్టిక్​ను ఎలా తగ్గిస్తున్నామో వివరించారు.

ప్లాస్టిక్​ రహిత రాష్ట్రంగా తెలంగాణ: నామ

By

Published : Nov 22, 2019, 1:09 PM IST

పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల గురించి నామ నాగేశ్వరరావు లోక్​సభలో వివరించారు. ప్లాస్టిక్ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు మహాత్తర కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఒకటి గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కాగా... మరొకటి ఒక కిలో ప్లాస్టిక్​కు కిలో బియ్యంను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఫలితంగా తెలంగాణ త్వరలోనే ప్లాస్టిక్​ రహిత ప్రాంతంగా తయారవుతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల ప్రధాన మంత్రి మోదీ మహబలిపురంలో ఉదయపు నడకలో ప్లాస్టిక్​ను తీసే వీడియో బాగా వైరల్​ అయ్యిందని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు లోక్​సభలో గుర్తు చేశారు. కేంద్రం కూడా తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని నామ సూచించారు.

ప్లాస్టిక్​ రహిత రాష్ట్రంగా తెలంగాణ: నామ


ఇవీ చూడండి:ప్లాస్టిక్​ కవర్లతో రండి.. మొక్కలు తీసుకెళ్లండి

ABOUT THE AUTHOR

...view details