తెలంగాణ

telangana

ETV Bharat / state

హత్య చేసి టూర్లు.. వారం తర్వాత శరీరభాగాల దహనం.. నవీన్‌ కేసులో విస్తుపోయే అంశాలు

Naveen Murder Case Remand Report: స్నేహితుడి చేతిలో దారుణంగా హత్యకు గురైన నవీన్ హత్య కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. నవీన్‌ను హత్య చేసేందుకు నిందితుడు హరిహరకృష్ణ మూడు నెలల ముందే పథకం రచించాడని తెలిపారు.

Naveen murder case
Naveen murder case

By

Published : Feb 27, 2023, 4:08 PM IST

Updated : Feb 28, 2023, 6:37 AM IST

Naveen Murder Case Remand Report: నవీన్‌ హత్య కేసు రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రేమకు అడ్డుపడుతున్నాడనే కారణంతో హరిహరకృష్ణ నవీన్‌ను దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఇందుకోసం 3 నెలల ముందే నుంచే నిందితుడు హరిహరకృష్ణ నవీన్‌ హత్యకు కుట్రపన్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నిందితుడు రెండు నెలల క్రితం సూపర్ మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేశాడని తెలిపారు.

ఈ నెల 17న మద్యం మత్తులో యువతి విషయంలో నవీన్ హరిహరకృష్ణ మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. దీంతో హరిహరకృష్ణ నవీన్‌ను ఓఆర్ఆర్ సమీపంలో గొంతునులిమి హత్య చేశాడని చెప్పారు. అనంతరం శరీరాన్ని ముక్కలు చేసి తల, వేళ్లు, ఇతర భాగాలు బ్యాగులో వేసుకొని వెళ్లాడని వివరించారు. అక్కడి నుంచి బ్రహ్మణపల్లికి చేరుకొని నవీన్‌ అవయవాలు పారేశాడని వివరించారు.

నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని హరిహరకృష్ణ స్నేహితుడు హసన్‌కు తెలియజేశాడని పోలీసులు అన్నారు. మరుసటిరోజు ప్రియురాలికి హత్య విషయాన్ని నిందితుడు చెప్పాడని పేర్కొన్నారు. హత్య తర్వాత నిందితుడు వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖలో నిందితుడి తిరిగాడని గుర్తించారు. ఈనెల 24న మరోసారి హత్య చేసిన స్థలానికి వెళ్లినట్లు హరిహరకృష్ణ అంగీకరించాడు. అప్పుడు మిగిలిన శరీర భాగాలు సేకరించి దహనం చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అదేరోజు సాయంత్రం పోలీసుల ఎదుట హరిహరకృష్ణ లొంగిపోయాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.

నవీన్‌ను హత్య చేసేందుకు హరిహరకృష్ణ పలు క్రైం వెబ్ సిరీస్‌లతో పాటు, యూట్యూబ్‌ చూసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తన కొడుకు చేసింది తప్పేనని హరికృష్ణ తండ్రి ప్రభాకర్ పేర్కొన్నారు. అయితే తన కొడుకు ఒక్కడే అంత కిరాతకంగా హత్య చేయడం సాధ్యం కాదని, ఇంకా ఈ హత్య వెనుక ఎవరో ఉన్నారని విమర్శించారు. హత్య కేసుపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపించాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నవీన్ కుటుంబ సభ్యులను క్షమించమని ప్రభాకర్ వేడుకున్నారు. కృష్ణ, నవీన్ ఇద్దరు ఇంటర్ నుంచి మంచి స్నేహితులేనని, ఒక అమ్మాయి మూలంగా ఇద్దరు జీవితాలు పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిల ట్రాప్​లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన యువకులకు సూచించారు.

Last Updated : Feb 28, 2023, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details