తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ టీం 2.O - SRINIVAS GOUD

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రభుత్వంలో కొత్త మంత్రులు చేరారు. 10 మంది ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

రాష్ట్ర మంత్రివర్గం

By

Published : Feb 19, 2019, 3:40 PM IST

కేసీఆర్​ మంత్రివర్గం
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ముగిసింది. అందరి ఊహాగానాలే నిజమయ్యాయి. 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్​భవన్​లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్​ నరసింహన్​ ప్రమాణస్వీకారం చేయించారు. వేదికపైకి ముందుగా ఇంద్రకరణ్‌ రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రమాణం చేశారు. కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డితో గవర్నర్‌ ప్రమాణం చేయించారు.

కొత్త మంత్రులను గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్​ అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, ​ హరీశ్​రావు, హోంమంత్రి మహమూద్​ అలీ, మండలి ఛైర్మన్​ స్వామిగౌడ్​, పార్టీ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details