తెలంగాణ

telangana

ETV Bharat / state

'యాదాద్రిలో తన బొమ్మలపై కేసీఆర్​ క్షమాపణ చెప్పాలి'

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ చిత్రం, అన్యమత చిహ్నాలను ఏర్పాటు చేయడాన్ని  భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కె.లక్ష్మణ్ అన్నారు. వెంటనే కేసీఆర్ హిందువులకు క్షమాపణలు చెప్పి..తప్పును దిద్దుకోవాలన్నారు.

హిందూవుల మనోభావాలను కేసీఆర్ దెబ్బ తీశారు : లక్ష్మణ్

By

Published : Sep 6, 2019, 5:52 PM IST

యాదాద్రి ఆలయంలో అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్​చిత్రాలను చెక్కించడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ ప్రచారకాంక్ష మాత్రమే కాదు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. వైభవోపేతమైన యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని భంగపర్చి..హిందూవులను తప్పుదోవ పట్టించడమేనని ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ చిత్రాలు,గుడి ప్రాశస్త్యం తప్ప అన్య మతాల చిహ్నాలను గతంలో శిల్పులు చెక్కిన సంఘటనలు లేవని లక్ష్మణ్ గుర్తు చేశారు.
సీఎం ఆదేశాల మేరకే శిల్పులు కేసీఆర్ చిత్రాన్ని, తెరాస గుర్తుని చెక్కినట్టు స్పష్టమవుతోందని ఆగ్రహించారు. హిందూయేతర మతానికి సంబంధించిన చార్మినార్​ను చిత్రించడం దుర్మార్గమని లక్ష్మణ్‌ మండిపడ్డారు. నిజాంకు సమాధి కట్టిన చరిత్ర తెలంగాణ బిడ్డలదని..కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశత్వానికి ఘోరీ కట్టడం పెద్ద కష్టమేమీ కాదని హెచ్చరించారు. కేసీఆర్ హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పి, ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు.

హిందూవుల మనోభావాలను కేసీఆర్ దెబ్బ తీశారు : లక్ష్మణ్

ABOUT THE AUTHOR

...view details