శాంతిభద్రతలపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష - cm kcr review meeting news
11:34 October 07
కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ అంశాలపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హోం, పీసీసీఎఫ్ శోభ, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి వంటి మాదకద్రవ్యాల నియంత్రణపై సీఎం సమీక్ష జరుగుతోంది. ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి.. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.