ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో విశాఖ శారద పీఠాధిపతి శ్రీస్వరూపానంద స్వామిని కలిశారు. అనంతరం స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో రాజ్యశ్యామల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని గులాబీ దళపతి స్వామి వారికి విన్నవించారు. జూన్‌లో జరగబోయే శారదా పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి స్వామీజీ ఆహ్వానించారు. విజయవాడలో జూన్ 15వ తేదీ నుంచి మూడ్రోజులపాటు ఉత్తరాధికారి కార్యక్రమాలు జరగనున్నాయి.
స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్ - SWAMIJI
ఫిలింనగర్ దైవసన్నిధానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. జూన్‌లో జరగబోయే శారదా పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి స్వామీజీ ఆహ్వానించడంతో కేసీఆర్ ఈరోజు స్వామివారిని కలిశారు.
స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్