తెరాస పార్లమెంటు అభ్యర్థుల ఖరారు చేసేందుకు గులాబీ అధినేత కసరత్తు ముమ్మరం చేశారు. ప్రగతి భవన్‌లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ తదితర నియోజకవర్గాలపై భేటీలో చర్చించారు. లోక్‌సభ అభ్యర్థులను రేపు ప్రకటించనున్నట్లు ప్రకటించిన దృష్ట్యా ఈ భేటీ కీలకంగా మారింది.
ప్రగతి భవన్‌లో ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ - LEADERS
కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తామంటున్న గులాబీ అధినేత రాష్ట్రంలో 16 స్థానాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. గెలుపుగుర్రాల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
తుది జాబితాపై కసరత్తు...
ప్రచార బాధ్యతలు...
మరోవైపు ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టిన కేసీఆర్... ఇప్పటికే పలు నియోజకవర్గాల ప్రచారాన్ని తామే చూసుకోవాలంటూ అభ్యర్థులకు సూచించారు. దాంతోపాటుగా మహబూబాబాద్ ఎన్నికల ఇన్‌ఛార్జీగా సత్యవతి రాథోడ్, వరంగల్, మహబూబాబాద్ ప్రచార పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి ఎర్రబెల్లికి అప్పగించారు.
ఇవీ చూడండి:'తెరాసకు ఓటేస్తే తెలంగాణ సమాజానికి లాభం'