తెలంగాణ

telangana

ETV Bharat / state

29న ఎల్బీ స్టేడియంలో కేసీఆ​ర్ ప్రతిష్ఠాత్మక సభ - MEETING

రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. అధికార పార్టీ తెరాస భారీ బహిరంగ సభలతో దూసుకుపోతోంది. ఈ నెల 29న నిర్వహిస్తున్న సభ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ

By

Published : Mar 26, 2019, 5:35 PM IST

పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 29న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ హాజరుకానున్న సభ ఏర్పాట్లను మేయర్ బొంతు రామ్మోహన్​తో కలసి పర్యవేక్షించారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గాల శ్రేణులకు కేసీఆర్​ దిశానిర్దేశం చేయనున్నారని మంత్రి పేర్కొన్నారు.

ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details