తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Interesting Comments in Nagpur : 'ఫుడ్‌ ప్రాసెసింగ్ పరిశ్రమలపై కేంద్రం ఎందుకు దృష్టి సారించడం లేదు'

CM KCR Nagpur Tour Updates : చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు శాస్త్రీయ విధానం ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో అనేక చిన్న, పెద్ద రాష్ట్రాలు ఉన్నాయని.. 6 లక్షల జనాభా ఉన్న సిక్కిం, 24 కోట్ల మంది ఉన్న యూపీ రాష్ట్రాలేనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు చాలా సంక్లిష్టంగా ఉందని కేసీఆర్ వివరించారు.

kcr
kcr

By

Published : Jun 15, 2023, 9:22 PM IST

Updated : Jun 15, 2023, 10:29 PM IST

KCR Comments in Nagpur Tour : దేశంలో విద్యుత్‌ ఉత్పత్తికి ఎన్నో వనరులు ఉన్నాయని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే 150 ఏళ్లకు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తికి.. బొగ్గు లభ్యత ఉందని చెప్పారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల మధ్య జల వివాదాలు నడుస్తున్నాయని అన్నారు. సరిపడా నీరు ఉన్నప్పటికీ రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్ పరిశ్రమలపై కేంద్రం ఎందుకు దృష్టి సారించడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా నుంచి బర్గర్లు, చికెన్ దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. చిన్న దేశమైన జింబాబ్వేలో 6500 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించారని వివరించారు. దేశంలో అలాంటి ప్రాజెక్టులను ఎందుకు నిర్మించడం లేదన్నారు. భారతదేశంలో ప్రతి ఎకరాకు, ప్రతి ఇంటికి అందించగలిగే నీరు ప్రకృతి ఇస్తోందని కేసీఆర్ వెల్లడించారు.

  • CM KCR Mancherial Tour : 'తెలంగాణ దేశంలో చాలా రంగాల్లో నంబర్‌వన్‌ స్థాయికి చేరింది'

ప్రకృతి ఇచ్చే నీటిని రైతులకు అందించే కార్యాచరణ కొరవడిందని కేసీఆర్ తెలిపారు. తాగటానికి నీరు లేని సింగపూర్‌ మనకంటే ఎన్నోరెట్లు అభివృద్ధి చెందిందని చెప్పారు. నీరు, మట్టిని దిగుమతి చేసుకునే సింగపూర్‌ ఎంతో అభివృద్ధి సాధించిందని వివరించారు. దేశంలో రోడ్లపై వాహనాల సగటు వేగం 50 కిలోమీటర్లు మాత్రమేనని అన్నారు. తలసరి ఆదాయంలో భూటాన్‌ కూడా మనకంటే మెరుగ్గా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

KCR Interesting comments in Nagpur :ఈ క్రమంలోనే రూపాయి విలువ నానాటికి దిగజారిపోతోందని కేసీఆర్‌ ఆరోపించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నదే బీఆర్ఎస్​ లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో సంస్కరణలు అమలు చేయాలన్నదే తమ డిమాండ్‌ అని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు శాస్త్రీయ విధానం ఉండాలని వివరించారు. దేశంలో అనేక చిన్న, పెద్ద రాష్ట్రాలు ఉన్నాయని.. 6 లక్షల జనాభా ఉన్న సిక్కిం, 24 కోట్ల మంది ఉన్న యూపీ రాష్ట్రాలేనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు చాలా సంక్లిష్టంగా ఉందని.. తద్వారా తెలంగాణ సాధనకు 14 ఏళ్లు పట్టిందని కేసీఆర్ వెల్లడించారు.

"దేశంలో విద్యుత్‌ ఉత్పత్తికి ఎన్నో వనరులు ఉన్నాయి. వచ్చే 150 ఏళ్లకు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తికి సరిపడా బొగ్గు లభ్యత ఉంది. దేశంలో ఎన్నో రాష్ట్రాల మధ్య జల వివాదాలు నడుస్తున్నాయి. సరిపడా నీరు ఉన్నప్పటికీ రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు? ఫుడ్‌ ప్రాసెసింగ్ పరిశ్రమలపై కేంద్రం ఎందుకు దృష్టి సారించటం లేదు. అమెరికా నుంచి బర్గర్లు, చికెన్ దిగుమతి చేసుకుంటున్నాం. చిన్న దేశమైన జింబాబ్వేలో 6500 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించారు. మన దేశంలో అలాంటి ప్రాజెక్టులను ఎందుకు నిర్మించటం లేదు. దేశంలో ప్రతి ఎకరాకు, ప్రతి ఇంటికి అందించగలిగే నీరు ప్రకృతి ఇస్తోంది. ప్రకృతి ఇచ్చే నీటిని రైతులకు అందించే కార్యాచరణ కొరవడింది." - కేసీఆర్, ముఖ్యమంత్రి

ఫుడ్‌ ప్రాసెసింగ్ పరిశ్రమలపై కేంద్రం ఎందుకు దృష్టి సారించటం లేదు

ఇవీ చదవండి :CM KCR Speech at Nagpur Meeting : 'దేశం మారాల్సిన సమయం వచ్చేసింది'

CM KCR Speech at BRS Training Camp : 'దేశం మొత్తం మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్​ఎస్ ఆవిర్భావం'

Last Updated : Jun 15, 2023, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details