Telangana Decade Celebrations Schedule : హైదరాబాద్‌లో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. జూన్ 2 నుంచి 22 వరకు మూడు వారాల పాటు సాగే.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల రోజు వారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను అధికారులకు వివరించారు. ఈ దిశగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. జూన్ 2న కేసీఆర్ గన్‌పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం నూతన సచివాలయంలో కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి.. దశాబ్ది ఉత్సవ సందేశంను ఇస్తారు. జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలను ఇవ్వనున్నారు.
జూన్ 3 నుంచి జూన్ 22 వరకు దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ :
- జూన్ 3న.. తెలంగాణ రైతు దినోత్సవం..
రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల అన్నదాతలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆ క్లస్టర్‌లోని గ్రామాలకు వ్యవసాయశాఖ ద్వారా వచ్చిన నిధుల గురించి వివరిస్తారు.
- జూన్ 4న.. సురక్షా దినోత్సవం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని.. సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోలీసుశాఖ సాధించిన ఘనతలు, విజయాలు ప్రజలకు తెలియజేసేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు.
- జూన్ 5న.. తెలంగాణ విద్యుత్ విజయోత్సవం
నియోజకవర్గ స్థాయిలోని అన్నదాతలు, వినియోగదారులు.. విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పులను వివరిస్తారు.
- జూన్ 6న.. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
రాష్ట్రంలో పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సభల్లో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని తెలియజేయనున్నారు.
- జూన్ 7న.. సాగునీటి దినోత్సవం
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేస్తారు.
- జూన్ 8న.. ఊరూరాచెరువుల పండుగ
గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో.. గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, తదితరులు పాల్గొంటారు.
- జూన్ 9న - తెలంగాణ సంక్షేమ సంబురాలు
నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులతో సభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే గ్రామీణ వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ కింద లక్ష రూపాయల పంపిణీ పథకంను ప్రారంభిస్తారు.
- జూన్ 10న.. తెలంగాణ సుపరిపాలన దినోత్సవం - పరిపాలన సంస్కరణలు, ఫలితాలు
అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.
- జూన్ 11న - తెలంగాణ సాహిత్య దినోత్సవం
రాష్ట్ర స్థాయిలో, జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నారు. రవీంద్రభారతిలో గంగాజమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు కవులచే రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనంను నిర్వహిస్తారు.
- జూన్ 12న.. తెలంగాణ రన్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో.. యువకులు, విద్యార్థులు ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమంను నిర్వహించనున్నారు.
- జూన్ 13న.. తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం