MLC Kavita in Delhi Liquor Case Update: దిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. ఈ మద్యం కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. వారిని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని ఎమ్మెల్సీ కవిత ట్వీటర్ వేదికగా వెల్లడించారు. తాను వేసిన పిటిషన్ ఈనెల 24న విచారణకు రానుందని తెలిపారు. ఈ వ్యవహారంలో ఈడీ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న వ్యక్తి గతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ వెల్లడించింది.
Kavita in Delhi Liquor Case: ఈనెల 11న దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు కవితన విచారించిన విషయం విధితమే. అయితే ఈనెల 16న విచారణకు హాజరవ్వాలని అదే రోజున నోటీసులు జారీ చేశారు. తాను హాజరుకాలేనని ఈడీకి ఈ మెయిల్ ద్వారా కవిత లేఖను పంపారు. మరో రోజున విచారణకు హాజరు అయ్యేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు లేఖలో వెల్లడించారు.
వారు అడిగిన పత్రాలను న్యాయవాది ద్వారా ఆమె పంపించారు. ఈడీకి మరో లేఖ రాస్తూ.. ఆడియో, వీడియో విచారణకైన ఆమె సిద్ధమని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు తన నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చన్నారు. తన ప్రతినిధిగా న్యాయవాది భరత్‌ను ఈడీకి పంపుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరో తేదీని ఖరారు చేస్తూ.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.తెలంగ