కవితకు అరుదైన గౌరవం
తెలంగాణ ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితి సమ్మిట్లో ప్రసంగించే అవకాశం దక్కింది. మార్చి1న దిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది.
కవితకు మరో అరుదైన గౌరవం
నాలెడ్జ్ భాగస్వామి డెలాయిట్తో కలిసి 4వ పారిశ్రామిక విప్లవం కోసం మహిళలను సిద్ధం చేయడం, భారతదేశంలో లింగ సమానత్వం అవార్డులను ప్రదానం చేసే పద్ధతులపైనా ఈ సదస్సులో చర్చిస్తారు. మన దేశ వ్యాపారాలు, విద్యాసంస్థలు, పౌర సమాజ సంస్థలకు బాధ్యతాయుతమైన వ్యాపార విధానాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ వేదికగా వ్యవహరిస్తోంది.
నాల్గవ పారిశ్రామిక విప్లవం ద్వారా వ్యాపార, సాంకేతికత, ఆటోమేషన్లలో మానవ-డిజిటల్ ఇంటర్ఫేస్ పాత్ర పెరిగింది. దీని వల్ల మన దేశంలోనూ యువత ఆయా రంగాల్లో తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం తప్పని సరైంది. ఉపాధి, నైపుణ్య సముపార్జనలోనూ మహిళలు పురోగమించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికంగా పట్టుసాధించడం, విద్యావిధాన మార్పులపై కూలంకషంగా చర్చిస్తారు.
Last Updated : Feb 16, 2019, 11:31 PM IST