నెహ్రు ఆనాడు ఆలోచన చేయకపోతే..కాశ్మీర్ 1948లోనే పాకిస్థాన్‌లో కలిసిపోయేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో జరిగిన స్వర్గీయ రాజీవ్ గాంధీ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నాగేశ్వర్ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కశ్మీర్ సమస్యపై ఎవరు మాట్లాడినా భాజపా దేశ ద్రోహులుగా ముద్ర వేస్తోందన్నారు. కశ్మీర్ భారతదేశంలో ముమ్మాటికి అంతర్భాగమేనని స్పష్టం చేశారు. కశ్మీర్‌తో పాటు పది రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేయడం వల్ల కశ్మీర్ శాశ్వతంగా మనకు దూరం అవుతుందన్న భయం ప్రజలలో ఉందని ఆయన తెలిపారు. గుజరాత్‌తో సమానంగా కశ్మీర్ అభివృద్ధి చెందినట్లు నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
'కశ్మీర్ భారతదేశంలో ముమ్మాటికి అంతర్భాగమే'
గాంధీభవన్ లో స్వర్గీయ రాజీవ్ గాంధీ 75 జయంతి ఉత్సవాలను రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
'కశ్మీర్ భారతదేశంలో ముమ్మాటికి అంతర్భాగమే'