కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని ఓ శ్మశానవాటికలో వారి మతాచారాలను పాటిస్తూ... కార్యక్రమం పూర్తి చేశారు.
మానవత్వం చాటిన ఎమ్మెల్యే.. కరోనా మృతదేహానికి అంత్యక్రియలు
ఏపీలోని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మానవత్వం చాటుకున్నారు. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి వారి మతాచారాలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్‌తో మృతిచెందిన వారికి గౌరవంగా వీడ్కోలు చెప్పాలని సూచించారు.
మానవత్వం చాటిన ఎమ్మెల్యే.. కరోనా మృతదేహానికి అంత్యక్రియలు
ప్రజలెవరూ కరోనా మృతదేహాలను చూసి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి వారి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు.