నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవితను ఎంపిక చేయడం హర్షణీయమని శాసనమండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కవిత ఓటమితో కార్యకర్తలు చాలా బాధ పడ్డారని.. ఇప్పుడు తిరిగి ఉత్సాహపూరిత వాతావరణం నెలకొందని ప్రభాకర్ తెలిపారు. కవిత ఓటమి పాలయ్యాక నిజామాబాద్ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని వారి కష్టాన్ని చూడలేకే... కవిత మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవితకు టికెట్ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులందరం స్వాగతిస్తున్నామన్నారు.
కవితకు ఎమ్మెల్సీ టిక్కెట్.. హర్షణీయం: కర్నె - ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవితను ఎంపికచేయడంపై కర్నె ప్రభాకర్ స్పందన
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులందరూ స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు.
'కవితకు టికెట్ ఇవ్వడాన్ని అందరూ స్వాగతిస్తున్నాం'