వట్టి మాటలతో భాజపా నేతల హుందాతనం తగ్గిపోతుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెరాస నేతలు తమతో టచ్‌లోకి వస్తున్నారని భాజపా నాయకులు మాట్లాడడం సరికాదన్నారు. ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారని.. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో అది రుజువైందని చెప్పారు. రాష్ట్రాల్లో అధికారం కోసం భాజపా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర భాజపా నేతలు సహకరించాలని కోరారు.
భాజపా నేతల మాటలు సరికాదు: కర్నె ప్రభాకర్ - భాజపా నేతల మాటలు సరికాదు: కర్నె ప్రభాకర్
తెరాస నేతలు తమతో టచ్‌లోకి వస్తున్నారని భాజపా నేతలు మాట్లాడడం సరికాదని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారని.. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో అది రుజువైందని చెప్పారు.
కర్నె ప్రభాకర్
TAGGED:
trs mlc