ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కల్పలత గెలుపు ఖాయమైంది. బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత విజయం సాధించింది. విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడంతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. 6,153 ఓట్లు దాటగానే కల్పలత గెలిచినట్లు అధికారులు వెల్లడించారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత - kalpalatha
ఏపీలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కల్పలత గెలుపు ఖాయమైంది. 6,153 ఓట్లు దాటగానే కల్పలత గెలిచినట్లు అధికారులు వెల్లడించారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత
తన విజయం కోసం కృషి చేసిన అందరికీ కల్పలత ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను స్థానికురాలు కాదనే అభిప్రాయం ఎక్కడా వ్యక్తం కాలేదని కల్పలత పేర్కొన్నారు.
ఇదీ చదవండి:సంక్షేమానికి పెద్దపీట... ఈసారి రెండు లక్షల కోట్ల బడ్జెట్!