తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం ప్రతిష్ఠాత్మకం... సంబురాలు సాంస్కృతికం.. - project

ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని గన్​పార్క్​ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా సంబురాలు జరిపారు.

ఘనంగా సంబురాలు

By

Published : Jun 21, 2019, 12:09 PM IST

Updated : Jun 21, 2019, 2:24 PM IST

నాంపల్లిలోని గన్​పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు జరిగాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా శివసత్తులు పూనకాలు, లంబాడీలు, గిరిజన నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబురాలతో అమరవీరుల స్థూపం వద్ద వాతావరణం కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్, మామిడి హరికృష్ణ, పలువురు నాయకులు పాల్గొని అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం గన్ పార్క్ నుంచి రవీంద్రభారతి వరకు ర్యాలీగా వెళ్లారు.

ఘనంగా సంబురాలు
Last Updated : Jun 21, 2019, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details