తెలంగాణ

telangana

ETV Bharat / state

బోటు వెలికితీతపై ఆనందం.. బాధిత కుటుంబాలకు సంతాపం

గోదావరి నదిలో కచ్చులూరు వద్ద మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును ధర్మాడి సత్యం బృందం, విశాఖకు చెందిన డైవర్లు శ్రమించి ఇవాళ బయటకు తీశారు. బోటు ఫ్యానుకు రోప్ బలంగా బిగించడం వల్లే బయటకు తీయగలిగామని సత్యం తెలిపారు.

బోటు వెలికితీతపై ఆనందం..

By

Published : Oct 22, 2019, 5:35 PM IST

బోటు వెలికితీతపై ఆనందం..

సెప్టెంబర్ 15న తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును 38 రోజుల తర్వాత బయటకు తీయగలిగారు. కాకినాడకు చెందిన నిపుణుడు ధర్మాడి సత్యం బృందం, విశాఖకు చెందిన డైవర్లు శ్రమించి ఎట్టకేలకు బోటును ఒడ్డుకు చేర్చారు. ఈ దిశగా.. ధర్మాడి సత్యం బృందం రెండు దఫాలుగా ఆపరేషన్ చేపట్టింది. ఇవాల్టికి వారి శ్రమ ఫలించింది. బోటు ఫ్యానుకు తాళ్లు గట్టిగా బిగించడం వల్లే బయటకు తీయగలిగామని ధర్మాడి సత్యం తెలిపారు. కొన్ని తెగిపోయినా ఫలితం సాధించామన్నారు. పని పూర్తయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details