రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారంపై విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. విద్యార్థులకు న్యాయం జరగకపోతే బోర్డు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు.
'రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి'
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు తనను బాధించాయని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ అన్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేఏ పాల్