గతేడాది డిసెంబర్లో తెలంగాణలో జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణకు మరో ఆరు నెలల గడువు కావాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ మేరకు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తరఫు న్యాయవాది పరమేశ్వర్ సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కమిషన్ను ఏర్పాటు చేసి.. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కరోనా కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని మరింత గడువు కావాలని కమిషన్ సుప్రీంకోర్టును కోరింది.
ఫిబ్రవరి 3న తొలిసారి కమిషన్ సమావేశమై మార్చి 23, 24న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని.. కరోనా నేపథ్యంలో ఆ తేదీల్లో సమావేశం నిర్వహించలేక పోయామని అప్లికేషన్లో పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 14 వరకు జుడిషియల్ కార్యకలాపాలు రద్దు చేయడం వల్ల విచారణకు ఆటంకం ఏర్పడిందని పేర్కొన్నారు.
కరోనా కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో కమిషన్ సభ్యులు ఉండటం.. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన సడలించినప్పటికీ... హైదరాబాదులో పరిస్థితి బాగాలేదని కమిషన్ తెలిపింది. కమిషన్కు కేటాయించిన ప్రాంతంలో కరోనా కేసులు గుర్తించారని.. విచారణ నిర్వహణకు ఇతర ప్రాంగణాలు అందుబాటులో లేవని సుప్రీం కోర్టుకు సమర్పించిన అప్లికేషన్లో పేర్కొన్నారు.
కమిషన్ సమావేశం కాకపోయినప్పటికీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచి పోలేదని సాక్ష్యాల సేకరణ కొనసాగుతుందని తెలిపారు. కరోనా సమయంలోనూ పోలీసులు, నిందితుల కుటుంబ సభ్యుల నుంచి 1365 అఫిడవిట్లు అందాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష