కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత జస్టిస్ బి.చంద్రకుమార్ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేస్తే... రైతులకు కార్పొరేట్లకు ఏదైనా వివాదాలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్లకూడదని చట్టంలో ఉండడం చాలా ప్రమాదకరమన్నారు.
'తక్షణమే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి' - తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రకుమార్
కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేయడాన్ని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత జస్టిస్ బి. చంద్రకుమార్ ఖండించారు. లోపభూయిష్టమైన మూడు వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
'తక్షణమే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి'
తక్షణమే వీటిని సవరించకపోతే... రానున్న రోజుల్లో పేద ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని... ఇది ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదమన్నారు.
ఇదీ చూడండి:డొల్ల పథకాలతో ఫలితం సున్న!