తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల వినూత్న నిరసన - ఎన్​ఎంసీ బిల్లు

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్​లో జూడాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గాంధీ ఆసుపత్రి ఎదుట వైద్యులు వినూత్న రీతిలో  నిరసన తెలిపారు. బిల్లు వల్ల వచ్చే సమస్యలు ప్రతిధ్వనించేలా స్వయంగా రాసిన పాటను పాడి... దానికి లయబద్ధంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మకు స్టెతస్కోపు వేసి ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్​ఎంసీ బిల్లు

By

Published : Aug 6, 2019, 6:27 PM IST

దేశవ్యాప్తంగా ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూడాలు తమ గళం వినిపిస్తుండగా... తెలంగాణలో జూడాలు వినూత్నరీతిలో ఆందోళన చేశారు. హైదరాబాద్​లో వైద్యులు చేపడుతున్న ధర్నాలో బతుకమ్మని భాగం చేశారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రకృతి పండుగ బతుకమ్మకు స్టెతస్కోప్​ వేసి నిరసన తెలిపారు. ఎన్​ఎంసీ బిల్లు వల్ల వచ్చే సమస్యలు ప్రతిధ్వనించేలా తామే స్వయంగా రాసుకున్న పాటను లయబద్ధంగా పాడుతూ... బతుకమ్మ ఆటలు ఆడారు.

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల వినూత్న నిరసన

ABOUT THE AUTHOR

...view details