8వ తేదీ నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం...
ఈ నెల 8వ తేదీ నుంచి తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాన్ని ప్రారంభిస్తున్నట్లు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. సుమారు 3 వేలమందికి ఆన్‌లైన్ ద్వారా దర్శనం కల్పిస్తామని... కంటైన్‌మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దొని స్పష్టం చేశారు.
గంటకు 500 మందికి మాత్రమే అనుమతి..
ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమవుతుందని ఆలయ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. జూన్ నెల కోటా మొత్తం విడుదల చేస్తామని అన్నారు. వసతి గదుల్లో ఒక్కరోజే మాత్రమే భక్తులకు అనుమతినిస్తామని.. ఒక్కో గదిలో ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. క్యూలైన్లలో ప్రతి 2 గంటలకు ఒకసారి శానిటైజేషన్ ఉంటుందని... 500 మంది సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చే అవకాశముందని తెలిపారు.