దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల కస్టడీని ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. నలుగురు నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా.. 14 రోజుల కస్టడీ పొడిగించింది. అనంతరం కేసు విచారణను ప్రత్యేక న్యాయస్థానం జనవరి 2కు వాయిదా వేసింది. బినయ్ బాబు బెయిల్ పిటిషన్‌పై ఈడీ నివేదిక సమర్పించగా.. జనవరి 9కి వాయిదా వేసింది. అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ల విచారణ జనవరి 4కు వాయిదా వేసింది.
దిల్లీ మద్యం స్కామ్ కేసు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు - Delhi liquor accuses Judicial custody extended
Judicial custody extension for Delhi liquor scam accused
15:44 December 19
దిల్లీ మద్యం స్కామ్ కేసు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Last Updated : Dec 19, 2022, 4:42 PM IST