judas strike on neet: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మూడ్రోజుల పాటు ఓపీ సేవలు బహిష్కరించనున్నట్లు రాష్ట్ర జూనియర్ వైద్యుల సంఘం వెల్లడించింది. నీట్ పీజీ కౌన్సిలింగ్‌లో జాప్యాన్ని నిరసిస్తూ ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓపీ సేవలను నిలిపేసి జూనియర్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి నీట్ పీజీ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఫలితాలు వచ్చి రెండు నెలలైంది
judas on neet counselling: నీట్ పరీక్షల ఫలితాలు వచ్చి దాదాపు రెండు నెలలు అవుతున్నా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించక పోవటంపై జూనియర్ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కేసు నడుస్తున్నందు వల్ల కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కేసును సుప్రీంకోర్టు 2022 జనవరి వరకు వాయిదా వేసిన ఫలితంగా... వచ్చే ఏడాదికి కూడా ప్రవేశాలు లభించని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
గాంధీ ఆస్పత్రిలో ధర్నా
judas dharna at gandhi: మరోవైపు ప్రస్తుతం రెండు బ్యాచ్‌ల పీజీ విద్యార్థులు మాత్రమే విధుల్లో ఉండటంతో ముగ్గురు చెయ్యాల్సిన పని ఇద్దరిపై పడుతోందని తెలిపారు. ఫలితంగా రెసిడెంట్ డాక్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జూడాలు చేస్తున్న సమ్మెలో భాగంగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జూడాలు సైతం ధర్నాలో పాల్గొన్నారు. నేటి నుంచి ఈ నెల 3వ తేదీ వరకు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూడాలు స్పష్టం చేశారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే.... 4వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా దీక్షలు చేస్తామని జూడాలు హెచ్చరించారు.
నీట్ కౌన్సెలింగ్ ఆలస్యం అవడం వల్ల ఈ ధర్నా చేస్తున్నాం. సెప్టెంబర్ నీట్ ఫలితాలు వచ్చాయి. కౌన్సెలింగ్ అక్టోబర్‌లో మొదలవ్వాలి. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కొందరు సుప్రీంలో కేసు వేశారు. ప్రస్తుతం రెండు బ్యాచ్‌ల డాక్టర్లు మాత్రమే ఉన్నారు. దేశవ్యాప్తంగా 45 వేల మంది రాకపోవడం వల్ల మాపై పని ఒత్తిడి పెరుగుతోంది. మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. త్వరగా కౌన్సెలింగ్ పూర్తయ్యేలా చూడాలి. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ త్వరగా పూర్తి కావాలి. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఒమిక్రాన్ వస్తే మరింత ఒత్తిడి పెరుగుతుంది. మూడు రోజుల్లో స్పందించకపోతే 4 వతేదీ నుంచి మరింత ఉద్ధృతం చేస్తాం. - డాక్టర్ కార్తిక్, జూనియర్ డాక్టర్
ఇదీ చూడండి: