.
జయరాం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హత్య జరిగిన రోజు రాకేశ్ ఇంటికి అతని స్నేహితులు వెంకటేశ్, రాజశేఖర్ వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. జయరాంను రాకేశ్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చిన సినీ సహాయ నటుడు సూర్యను మరోసారి ప్రశ్నిస్తున్నారు.
హత్యలో ఇద్దరు రౌడీషీటర్లు
హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గత నెల 31వ తేదీన జూబ్లీహిల్స్ లోని రాకేశ్ రెడ్డి ఇంట్లో జయరాంను హత్య చేసిన సమయంలో నగేశ్, విశాల్ అనే ఇద్దరు రౌడీషీటర్లు కూడా పాలుపంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం నలుగురి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈరోజుతో ముగియనున్న కస్టడీ
వీణా అనే మహిళ పేరుతో చాటింగ్ చేసిన రాకేశ్ రెడ్డి.. జయరాంను ఇంటికి రప్పించుకున్నాడు. రెండు రోజుల పాటు అతన్ని చిత్రహింసలకు గురిచేసి డబ్బులు రాకపోవడం వల్లే హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ కస్టడీ ఈరోజుతో ముగియనుంది. ఈలోపు వీలైనంత సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
చిత్ర హింసలు పెట్టి చంపారు